Rayapol | రాయపోల్ మండలంలో గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల
సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని 19 గ్రామపంచాయతీలకు తొలి విడతగా 15 ఫైనాన్స్ కమిషన్ 2023-24 ఏడాదికి సంబందించిన నిధులు విడుదలయ్యాయి.
రాయపోల్ ఫిబ్రవరి 02 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని 19 గ్రామపంచాయతీలకు తొలి విడతగా 15 ఫైనాన్స్ కమిషన్ 2023-24 ఏడాదికి సంబందించిన నిధులు రూ.36 లక్షల 85 వేల 42 రూపాయలు విడుదలయ్యాయి. మరో ఐదు విడతల్లో నిధులు రావాల్సి ఉన్నది. రెండేళ్లుగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కొనసాగిన గ్రామపంచాయతీలకు నిధులు అందకపోవడంతో అప్పట్లో పలు అభివృద్ధి పనులకు సొంతంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. ఇప్పుడొచ్చిన నిధులతో ముందుగా అప్పటి బకాయిలు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే కేంద్రం నుంచి విడతల వారీగా నిధులు విడుదలవుతుండటంతో వచ్చిన మొత్తానికి అనుగుణంగా బకాయిలు చెల్లిస్తామని సర్పంచులు స్పష్టం చేస్తున్నారు. మొత్తం బకాయిలు ఒకేసారి చెల్లించాలన్న కార్యదర్శుల పట్టుదలతో ఇరువర్గాల మధ్య మనస్పర్ధలు తలెత్తే పరిస్థితి నెలకొంది. నిధుల వినియోగం, బకాయిల చెల్లింపుపై స్పష్టత రాకపోతే గ్రామస్థాయిలో పాలనపై ప్రభావం పడే అవకాశం ఉందన్న చర్చ ఊపందుకుంది. జిల్లా అధికారుల సమన్వయంతో ఈ వివాదానికి త్వరితగతిన పరిష్కారం లభించాలని ప్రజలు ఆశిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

