గాంధీనగర్ : రోజూ అన్నయ్య తిడుతున్నాడని కోపం పెంచుకున్న 15 ఏండ్ల బాలుడు.. గర్భవతియైన వదినను రేప్ చేసి, ఆమెను హత్య చేసి, ఆమె గర్భంలోని పిండాన్ని బయటకు లాగిన దారుణ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. అంతకుముందే ఆ బాలుడు తన అన్నను కూడా దారుణంగా కొట్టి హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అక్టోబర్ 16న జరుగగా, పోలీసులు మృతదేహాలను వెలికి తీయడంతో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం జన్గఢ్ నగరానికి 50 కి.మీ దూరంలో ఉన్న ఒక కుగ్రామంలో పశువుల కొట్టంలో పనిచేసే 15 ఏండ్ల బాలుడిని ఆయన అన్న నిత్యం తిడుతూ, కొడుతూ వేధించే వాడు. ఆ కుర్రాడి సంపాదనను కూడా లాక్కునే వాడు. దీంతో కోపం పెంచుకున్న ఆ బాలుడు ఈ నేరాలకు ఒడిగట్టాడు.