హైదరాబాద్ : గచ్చిబౌలి పరిధి టీఎన్జీవో కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో భవనం సెల్లార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. భవనం పై అంతస్తులో చిక్కుకున్న 11 మందిని కాపాడారు. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. భవనం సెల్లార్లో ఉన్న 15 బైక్లు దగ్ధమయ్యాయి. దట్టంగా పొగ కమ్ముకోవడంతో చుట్టు పక్కల ప్రజలు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Womens Reservation | బీజేపీ బిల్లులపై రాజే ఆగ్రహం..!వైరల్గా మారిన విమర్శ లేఖ
Tamil Nadu | బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 18 మంది మృతి, ఆరుగురికి గాయాలు