గాజా సిటీ: హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిలీలను బందీ చేసిన విషయం తెలిసిందే. అయితే 42 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన నేపథ్యంలో ఇవాళ హమాస్ చెరలో ఉన్న 14 మంది బందీలు విడుదల కానున్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. హమాస్, ఇజ్రాయిల్ మధ్య ఇటీవల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఖైదీల అప్పగింతకు బదులుగా బందీలను విడుదల చేయనున్నారు. డజన్ల సంఖ్యలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు రిలీజ్ కానున్నట్లు ఇజ్రాయిల్ దళాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం హమాస్ ఉగ్రవాదుల వద్ద ఇంకా 150 మందికిపైగా బందీలు ఉన్నట్లు తెలుస్తోంది.