న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలోని కర్తవ్యపథ్‌లో ఈ నెల 26న జరిగే 76వ గణతంత్ర దినోత్సవాలకు సుమారు 10,000 మంది ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వీరిలో పారాలింపిక్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు, ఉత్తమ పని తీరు కనబరచిన గ్రామాల సర్పంచ్‌లు, చేనేత కళాకారులు, అటవీ, వన్య ప్రాణి సంరక్షకులు ఉన్నారు.