ఆదిలాబాద్ జిల్లాలోని ముక్రా (కే) గ్రామంలో ఒక్కరోజు ముందుగానే దీక్షా దివస్ వేడుకలు జరుపుకున్నారు. ఎడ్లబండిపై కేసీఆర్ ఫొటో పెట్టి, డప్పులు వాయిస్తూ ఊరంతా తిరిగారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
దశాబ్దన్నరం క్రితం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే గొప్ప త్యాగనిరతితో దీక్షను చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ముక్రా కే గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు. చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ సాహసాన్ని నెమరేసుకుందామని అన్నారు. కేసీఆర్ లేకుండా ఇంకా 300 ఏండ్లయినా తెలంగాణ వచ్చేది కాదని అన్నారు.
సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిపారని, మళ్లీ కేసీఆర్ వస్తేనే తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుపడతాయని, కేసీఆర్ తప్ప మరో నాయకుడు తెలంగాణను అభివృద్ధి చేయలేడని, దీక్షా దివస్ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన దినమని అన్నారు.
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసేదాకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకత్వంలో పార్టీ కోసం ఎల్లవేళలా పని చేస్తూనే ఉంటామని, కేసీఆర్ చిత్రపటాన్ని ఎడ్లబండిపై పెట్టి డప్పులు వాయిస్తూ కేసీఆర్ చిత్రపటానికి గ్రామంలో పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.