Killings : లొంగిపోయిన ఇద్దరు పాలస్తీనియన్ల (Palestinians) ను ఇజ్రాయెల్ దళాలు (Israel troops) కాల్చిచంపడం తీవ్ర వివాదానికి దారితీసింది. తమ దగ్గర ఆయుధాలు లేవన్న సంకేతంతో చేతులెత్తి లొంగిపోయిన తర్వాత వారిని కాల్చి చంపారని, ఇది ‘కోల్డ్ బ్లడ్ హత్య (Cold blood murder)’ అని పాలస్తీనా అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అరబ్ టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో దుమారం రేగింది. దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఓ గ్యారేజ్ నుంచి చేతులు పైకెత్తి, తమ వద్ద పేలుడు పదార్థాలు లేవని చూపిస్తూ బయటకు రావడం కనిపించింది. సైనికులు వారిని నేలపై పడుకోబెట్టి, ఆ తర్వాత తిరిగి గ్యారేజ్‌లోకి వెళ్లమని ఆదేశించారు. వారు నేలపై ప్రాకుతూ గ్యారేజీలోకి వెళ్లగానే సైనికులు కాల్చిచంపారు. మరణించిన వారిని వాంటెడ్ మిలిటెంట్లుగా ఇజ్రాయెల్ సైన్యం పేర్కొన్నది.
వారు గతంలో సైనికులపై పేలుడు పదార్థాలు విసిరి, కాల్పులు జరిపారని తెలిపింది. అయితే, లొంగిపోయిన తర్వాత కాల్పులు జరపడంపై సమీక్ష జరుపుతున్నట్లు వివరించింది. కానీ ఇజ్రాయెల్ జాతీయ భద్రతాశాఖ మంత్రి ఇటమార్ బెన్-గ్విర్ సైన్యాన్ని ప్రశంసించారు. ఉగ్రవాదులు చావాల్సిందేనని వ్యాఖ్యానించారు. పాలస్తీనా ప్రధాని కార్యాలయం మాత్రం ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి చేసిన హత్య అని ఖండించింది.
You can’t watch this video and not hate Israel.
Israeli soldiers EXECUTE two young Palestinian men at point-blank range AFTER they surrendered near in the northern occupied West Bank.
This apartheid must end. Boycott and shun everything to do with it.
pic.twitter.com/kyR55cqTzd— ADAM (@AdameMedia) November 27, 2025