Maoist Devji | దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్జడ్సీ) ఒక ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీ సహా మరో 50 మంది పోలీసుల అదుపులో ఉన్నారని ఆ లేఖలో పేర్కొంది. వారిని కోర్టులో హాజరుపరిచాలని డిమాండ్ చేసింది.
డీకేఎస్జడ్సీ కార్యదర్శి వికల్ప్ పేరిట గురువారం రిలీజైన ఈ ప్రకటన ఈ నెల 22వ తేదీతో ఉంది. ఇందులో నవంబర్ 18వ తేదీన జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ గురించి అందులో ప్రస్తావించారు. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో హిడ్మా సహా ఆరుగురు మరణించారని పేర్కొన్నారు. ఈ నెల 19న అదే ప్రాంతంలో సురేశ్, శంకర్ సహా ఏడుగురిని బూటకపు ఎన్కౌంటర్లో చంపారని అన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 30వ తేదీన చత్తీస్‌గఢ్ దండకారణ్య బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.