మెదక్ మున్సిపాలిటీ,నవంబర్ 28 : భారత ప్రథమ సామాజికతత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడు, మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్ అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణ పార్టీ కన్వీనర్ మామిండ్ల ఆంజనేయులు, మాజీ మార్కెట్ మాజీ చైర్మన్ కృష్ణ రెడ్డి మాజీ కౌన్సిలర్లు, నాయకులతో కలసి మున్సిపల్ మల్లికార్జున గౌడ్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..సమ సమాజ స్థాపనకు, బడుగు, బలహీన వర్గాలకు విద్యను అందిస్తూ అన్నిట్లో సమాన హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయ సాధనలో అందరం నడుద్దామన్నారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ముందంజ వేయడానికి మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు భీమరి కిశోర్, జయరాజ్ ,ఆర్ కె .శ్రీనివాస్, మాయ మల్లేశం, నాయకులు లింగా రెడ్డి, ప్రభు రెడ్డి, మోచి కిషన్, జుబెర్ అహ్మద్, మోహన్ నాయక్, రుక్మాచారి తదితరులు పాల్గొన్నారు.