రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లా జైలు నుంచి గురువారం ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. జైలు గోడ దూకి పరారయ్యారని, ఈ మేరకు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని అధికారులు తెలిపారు. వారిని జైలు గార్డులు పట్టుకునేందుకు ప్రయత్నించినా.. వేర్వేరు దిశల్లో పారిపోయారని జైలు సూపరింటెండెంట్ ఆర్ఎస్ సింగ్ తెలిపారు. పట్టుకునేందుకు నగరంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఘటనపై పోలీసులకు సైతం సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఐదుగురు ఖైదీల్లో ముగ్గురు ధన్సాయ్ (33), దామ్రుధర్ (24), రాహుల్ (22) దోపిడీ కేసుల్లో దోషులుగా తేలి 2019 నుంచి జైలులో ఉంటున్నారని, అదే సమయంలో మరో ఖైదీ కరణ్ (21) మాదక ద్రవ్యాల కేసులో దోషిగా తేలాడని సూపరింటెండెంట్ తెలిపారు.
ఐదో ఖైదీ దౌలత్ (23) అత్యాచారం కేసులో గతేడాది జైలుకు వచ్చాడని చెప్పారు. ఇందులో రాహుల్ ఉత్తరప్రదేశ్ నివాసి కాగా.. మరికొందరు మహాసముంద్ జిల్లాకు చెందిన వారే. నిందితులు పారిపోయిన ఘటనలో పోలీసులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఖైదీలను గుర్తించేందుకు వివిధ ప్రదేశాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న ఏసీపీ మేఘా తుంబుర్కర్ తెలిపారు. పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని, పరారీలో ఉన్న ఖైదీలను గుర్తించాలని హోంమంత్రి తమరాద్వాజ్ సాహు జైలు అధికారులను ఆదేశించారు.
Chhattisgarh | 5 prisoners escape from jail in Mahasamund
— ANI (@ANI) May 7, 2021
The CCTV footage shows that after climbing a wall five prisoners escaped from jail, there is a police alert at every checking point in the city: ASP Megha Tembhurkar pic.twitter.com/OIMqvvqMQE