రోడ్డు పక్కన కంకులు అమ్ముతున్న ఈ బామ్మను చూడండి ! అందులో వింత ఏముంది అనుకుంటున్నారా !! జాగ్రత్తగా గమనించండి.. పక్కనే ఓ సాలర్ ప్యానెల్ కనిపిస్తుందా? సాధారణంగా అయితే కంకులు కాల్చేప్పుడు బొగ్గులు మండటం కోసం విసురుతుంటారు కదా ! ఈ బామ్మ మాత్రం టెక్నాలజీని వాడుకుని కంకులు కాలుస్తోంది. సోలార్ పవర్‌తో నడిచే ఫ్యాన్ గాలితో బొగ్గులను మండిస్తూ కంకులను కాలుస్తోంది. అంతేకాదు సాయంకాలం పూట బండికి కావాల్సిన లైట్ ను కూడా ఈ సోలార్ ప్యానెల్‌తోనే ఏర్పాటు చేసుకుంది. బెంగళూరులో కనిపించిన ఈ దృశ్యాన్ని వీవీఎస్ లక్ష్మణ్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. టెక్నాలజీని వాడుకుంటున్న 75 ఏళ్ల సెల్వమ్మ అదుర్స్ అని వీవీఎస్ లక్ష్మణ్ కితాబిచ్చాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఒంటెల పందేల గురించి మీకు తెలుసా