యాదాద్రి సందర్శనకు వచ్చే భక్తులకు మధురానుభూతి కలిగేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ సంకల్ప సిద్ధితో అధికారులు యాదాద్రి క్షేత్రాన్ని సకల హంగులతో తీర్చిదిద్దుతున్నారు. భక్తులకు కనులవిందు చేసేలా ఇప్పటికే వివిధ రకాల మొక్కలతో గార్డెన్స్ ఏర్పాటుచేసిన అధికారులు.. తాజాగా మొదటి ఘాట్ రోడ్డు వెంట ఉన్న రాతి గుట్టలపై ఏకంగా జలపాతాన్నే సృష్టించారు. గుట్టపై నుంచి జాలువారుతున్న దృశ్యం భక్తులకు ఆహ్లాదాన్నిస్తుందని వైటీడీఏ అధికారులు తెలిపారు.