Mallanna Sagar | కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టానికి ముహూర్తం ఆసన్నమైంది! తెలంగాణ జలకిరీటంగా భాసిల్లే మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కాళేశ్వరుడి పాదాలను అభిషేకించి.. రాజన్న జటాఝూటంనుంచి పరవళ్లు తొక్కి.. అన్నపూర్ణ ఒడిలో సేదదీరి.. రంగనాయకుడి చెంతకు చేరిన గంగమ్మ కొమురెల్లి మల్లన్నకు జలబోనాన్ని సమర్పించుకొనేందుకు ఉరకలెత్తి వచ్చింది. తెలంగాణ తల్లి జలకిరీటం ధరించింది. తెలంగాణ జల విధాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బుధవారం మల్లన్న గంగ ఉప్పొంగనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లన్నింటిలోనూ అతి పెద్దది.. అత్యంత ఎత్తున ఉన్నదీ ఇదే! డ్యామ్ ప్రొటోకాల్‌ను అనుసరించి ఇప్పటికే నీటి నిల్వ సామర్థ్య పరీక్షలు విజయవంతం కావడంతో మల్లన్నసాగర్ ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇవీ మల్లన్నసాగర్ ప్రత్యేకతలు