
దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరమంతా అతలాకుతలమైపోయింది. రహదారులపై భారీగా వరదనీరు చేరడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. విమానాశ్రయంలోకి సైతం వరదనీరు చేరడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదల కారణంగా ఇంట్లో నుంచి బయటకు రావడానికే జనాలు జంకుతున్నారు. గత 18 ఏండ్లలో తొలిసారిగా రికార్డు స్థాయిలో 1005.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో అరెంజ్ అలర్ట్ జారీ చేశారు.



















