CM KCR | హైదరాబాద్ నగరంలోని కొత్తపేట(ఎల్బీనగర్), ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్(సనత్ నగర్), అల్వాల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజలు చేశారు. ఈ మూడు ఆస్పత్రుల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. వైద్య విద్య కోసం పీజీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో టిమ్స్‌ను 1000 బెడ్ల సౌకర్యంతో నిర్మించనున్నారు. ప్రతి ఆస్పత్రిలో 26 ఆపరేషన్ థియేటర్లు, 300 ఐసీయూ బెడ్స్‌తో పాటు ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులోకి రానుంది.