రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ మొదలైంది. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బతుకమ్మ పండుగ సమీపిస్తుండటంతో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీని శనివారం మొదలు పెట్టారు. ఈ నెల 6వ తేదీ వరకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. 18 ఏండ్లు పైబడి రేషన్ కార్డులో పేరు నమోదైన వారికి చీరలను పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది 810 రకాల చీరలను, 1.08 కోట్ల మహిళలకు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. బతుకమ్మ చీరల కోసం రూ. 333.14 కోట్లు ఖర్చు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పేద ఇంటి ఆడపడుచులకు ప్రభుత్వ కానుక బతుకమ్మ చీరెలు: మంత్రి ఎర్రబెల్లి
బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్..