ఆకలేస్తే హోటల్‌కు వెళ్లే రోజులు ఇప్పుడు పోయాయి. ఎవరైనా సరే వెంటనే మొబైల్లో జొమాటో, స్విగ్గీల్లో ఆర్డర్లు ఇస్తున్నారు. ఈ డెలివరీలు ఇస్తూ చాలా మంది జీవనాలు సాగిస్తున్నారు. కానీ ఈ ఉద్యోగాల్లో డేంజర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా ముంబైలో జరిగిన ఘటన అలాంటిదే. పన్వేల్‌లో ఒక అపార్ట్మెంట్లో డెలివరీ ఇచ్చి వస్తున్న నరేంద్ర పెరియార్ అనే జొమాటో ఎగ్జిక్యూటివ్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది.
లిఫ్ట్‌లో కిందకు వచ్చే సరికి ఎదురుగా ఒక జర్మన షెపర్డ్ శునకం కనిపించింది. దాన్ని చూసి బెదిరిన పెరియార్ వెనకడుగు వేశాడు. ఆ కుక్క యజమాని దాన్ని పక్కకు లాగేందుకు ప్రయత్నించాడు. దీంతో పెరియార్ లిఫ్టులో నుంచి బయటకు వచ్చాడు. అలా అతను బయటకు రాగానే ఆ కుక్క అతనిపై దాడి చేసింది. అతని మర్మాంగాలను కొరికింది.
అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత రక్తం కారుతుంటే తనకు గాయమైందని తెలిసిందని, దగ్గరలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా నొప్పి తగ్గలేదని పెరియార్ చెప్పాడు. దీంతో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి అతన్ని తరలించారు. పెరియార్ మెడికల్ బిల్లులను కుక్క యజమానే భరిస్తున్నాడు. కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వాటికి సరైన శిక్షణ ఇచ్చి చైన్ వేసి ఉంచాలని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.
#Watch | German Shepherd bites #Zomato delivery executive's crotch in #Panvel apartment complex https://t.co/UJVjLXGp26#GermanShepherd #Shocking #ShockingVideo #ZomatoDeliveryBoy #Viral #ViralVideo pic.twitter.com/c2nUGPMnpa
— Free Press Journal (@fpjindia) August 31, 2022