Yusuf Pathan : లోక్సభ ఎన్నికల తుది దశ పోరుకు ప్రచారం గురువారం సాయంత్రం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీలు అగ్ర నేతలు, స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇక ప్రచార గడువు ముగిసే ముందు పశ్చిమ బెంగాల్లోని బహరంపూర్ లోక్సభ నియోజకవర్గ టీఎంసీ అభ్యర్ధి యూసుఫ్ పఠాన్ విలేకరులతో మాట్లాడారు.
ఈ ఎన్నికల్లో అంచనాలు తారాస్ధాయిలో ఉన్నాయని, టీఎంసీకి పశ్చిమ బెంగాల్లో అత్యధిక స్ధానాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న టీఎంసీ సత్తా చాటనుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి బెంగాల్లో మొండిచేయి తప్పదని అన్నారు.
Read More :