న్యూఢిల్లీ : కొందరు తమకు తోచిన చిన్న సాయం చేయడం, భరోసాగా నిలవడం వంటి పనులు చేసినా పలువురి ముఖాల్లో (Viral Video) నవ్వులు పూయిస్తాయి. యూట్యూబర్ అశ్వని థాపా ఇలాంటి పనితోనే నెటిజన్ల ప్రశంసలు చూరగొన్నాడు. ఉత్తరాఖండ్‌లోని బురన్స్కంద గ్రామంలో తన ప్రయాణం గురించి అశ్వని షేర్ చేసిన గ్లింప్స్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి.
ఈ వీడియోలో అశ్వని ఏకంగా గ్రామస్తులందరికీ మోమో పార్టీ ఇవ్వడంతో పాటు కేక్‌తో సెలబ్రేట్ చేశాడు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అతడు ఎంత కష్టపడ్డాడనేది ఈ వ్లాగ్ వివరిస్తుంది. భారీ వర్షాలతో అతడి ఈవెంట్ రద్దయ్యే ప్రమాదంలో పడినా సహచరుల ప్రయత్నాలతో తాను అనుకున్న ఈవెంట్ నిర్వహణ సాకారమైంది. ఎట్టకేలకు గ్రామస్తులందరికీ మోమోస్‌తో విందు ఇచ్చాడు.
చివరికి కోతి సైతం ఈ పార్టీలో పాలుపంచుకుంది. ఈ వీడియోను నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి 17,000 మందికిపైగా వీక్షించారు. వరదలతో భీతిల్లిన గ్రామస్తుల ముఖాలపై యూట్యూబర్ నవ్వులు పూయించాడని నెటిజన్లు ప్రశంసించారు. వర్షాలకు గ్రామస్తులంతా క్షేమంగా ఉన్నారా..! అసలు వారి పరిస్ధితేంటని మరికొందరు యూజర్లు ఆరా తీశారు.
Read More :
Hollywood | సమ్మెకు దిగిన హాలీవుడ్ నటులు.. మూతపడిన ఇండస్ట్రీ !