Hollywood | సమ్మెకు దిగిన హాలీవుడ్ నటులు.. మూతపడిన ఇండస్ట్రీ !
హాలీవుడ్లో (Hollywood) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కలకలం సృష్టిస్తున్నది. తమ భవిష్యత్తుకు భరోసా కల్పించాలని, రెమ్యూనరేషన్లు పెంచాలని, ఏఐ నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించాలని డిమాండ్ చేస్తూ హాలీవుడ్‌కు చెందిన ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ (The Screen Actors Guild) సమ్మెకు (Strike) దిగింది.
లాస్ ఏజెంల్స్: హాలీవుడ్లో (Hollywood) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కలకలం సృష్టిస్తున్నది. తమ భవిష్యత్తుకు భరోసా కల్పించాలని, రెమ్యూనరేషన్లు పెంచాలని, ఏఐ నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించాలని డిమాండ్ చేస్తూ హాలీవుడ్‌కు చెందిన ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ (The Screen Actors Guild) సమ్మెకు (Strike) దిగింది. నిర్మాణ స్టూడియోలతో జరిగిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో నిరవధిక సమ్మెకు గిల్డ్ (SAG-AFTRA) పిలుపునిచ్చింది. దీంతో గురువారం అర్ధరాత్రి నుంచి గిల్డ్‌లో ఉన్న లక్షా 60 వేల మంది నటీనటులు సమ్మెబాట పట్టారు. ఇవే డిమాండ్లతో గత 11 వారాలుగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా (Writers Guild of America) సమ్మెకు దిగింది. తాజాగా వారికి నటీనటులు తోడవంతో హాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మూతపడినట్లయింది. ఇలా రచయితలు, నటులు ఒకేసారి సమ్మెకు దిగడం గత 63 ఏండ్లలో ఇదే తొలిసారి.

Hollywood
హాలీవుడ్లో మొదటిసారిగా 1960లో నటుడు రోనాల్డ్ రీగన్ నేతృత్వంలో రెండు యూనియన్లు డబుల్ స్ట్రైక్ (Double strike) చేశాయి. 1980లో స్క్రీన్ యాక్టర్స్ సమ్మె జరిగింది. ఇన్నేండ్ల తర్వాత రైటర్స్ గిల్డ్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ కలిసి మరోసారి డబుల్ స్ట్రైక్ చేస్తున్నాయి. ఈసారి 98 శాతం మంది నటీనటులు ఈ సమ్మెకు మద్దతు తెలపడం విశేషం.

Hollywood
ఈ సమ్మెతో హాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాలు, టీవీ సిరీస్‌లు ఆలస్యం కానున్నాయి. ఇదిలాగే కొనసాగితే భారీ సినిమాల రిలీజ్లు వాయిదా పడటం ఖాయం. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాల ప్రమోషన్లకు కూడా నటీనటులు దూరంగా ఉండనున్నారు. కాగా, ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భమని, ఇప్పుడు కనుక తాము తమ గళం వినిపించకపోతే కష్టాల్లో పడతామని గిల్డ్ ప్రెసిడెంట్ ఫ్రాన్ డ్రెషర్ అన్నారు. అత్యాశకు పోతున్న స్టూడియోల వల్ల తాము బాధితులం అవుతున్నామని నటీనటులు వాపోతున్నారు.

Hollywood
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

