మధురై: తమిళనాడులో బీహారీ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నట్లు ఫేక్ వీడియోలు పోస్టు చేసిన కేసులో యూట్యూబర్ మనీశ్ కశ్యప్(YouTuber Manish Kashyap) అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే అతన్ని గురువారం మధురై కోర్టులో హాజరుపరిచారు. ఆ కేసులో అతన్ని మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. మార్చి 18వ తేదీన అతన్ని బీహార్(Bihar)లోని బెట్టాయ్లో అరెస్టు చేశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఆర్థిక నేరాల శాఖ(Economic Offence Wing).. కశ్యప్ ఇంటిని జప్తు చేసేందుకు ప్రయత్నించడంతో అతను లొంగిపోయిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో ఫేక్ వీడియోల(face videos)ను ప్రమోట్ చేస్తున్న కేసులో అతన్ని అరెస్టు చేశారు. తమిళనాడులో ఉన్న వలస కార్మికులును చంపుతున్నట్లు, కొడుతున్నట్లుగా కొన్ని వీడియోలను కశ్యప్ సర్క్యులేట్ చేశాడు. ఈ కేసులో ఇప్పటికే హిందూ మున్నాని సంస్థ(Hindu Munnani Outfit)కు చెందిన నలుగుర్ని అరెస్టు చేశారు. వలస కార్మికులపై దాడి జరుగుతున్నట్లు ఫేక్ వీడియోలు వ్యాప్తికావడంతో తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఆ తర్వాత ఈ అంశాన్ని ఆయన బీహార్ సీఎం నితీశ్తోనూ మాట్లాడారు.