న్యూఢిల్లీ, మే 20: భారతీయ అండర్కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పాకిస్థాన్ ఇంసెస్ ఇంటెలిజెన్స్టర్ సర్వీ(ఐఎస్ఐ) ఉపయోగించుకున్నట్లు మంగళవారం అధికార వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ కోసం గూఢచారిగా పనిచేసిన జ్యోతి ప్రస్తుతం ఐదు రోజుల పోలీసు కస్టడీలో ఉంది. ఆమెను ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), హర్యానా పోలీసులతో కూడిన సంయుక్త బృందం ప్రశ్నిస్తున్నది.
అలీ హసన్ అనే ఐఎస్ఐ హ్యాండ్లర్, జ్యోతి మధ్య జరిగిన వాట్సాప్ చాట్లు వెలుగుచూసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భారతదేశ అండర్కవర్ ఆపరేషన్లకు సంబంధించి సంకేత భాషలో వారి మధ్య సాగిన సంభాషణలు దర్యాప్తు బృందానికి లభించాయి.