న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: దేశంలో ఇటీవలి కాలంలో పిల్లలు, యువకులు కూడా గుండెపోటుతో కుప్పుకూలుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ యువకుడు (25)గుండెపోటుతో మరణించాడు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని భార్య ఆత్మహత్య చేసుకున్నది.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన దంపతులు అభిషేక్, అంజలి సోమవారం ఆహ్లాదంగా గడిపేందుకు ఢిల్లీ జంతు ప్రదర్శనశాలకు వెళ్లగా, అక్కడ భర్తకు తీవ్రమైన ఛాతి నొప్పి రావటంతో కుప్పకూలాడు. దవాఖానకు తీసుకుపోగా, అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని భార్య.. 7వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. యువ దంపతుల మరణవార్త ఇరు కుటుంబాల్ని, స్థానికుల్ని షాక్‌కు గురిచేసింది.