రాయ్పూర్ : కాంగ్రెస్ హయాంలో ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు. చత్తీస్ఘఢ్లోని కోర్బాలొ ఆదివారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పాలనలో యువత ఉపాధి కోసం వలసబాట పట్టేవారని, వ్యాపారులు, పర్యాటకులు, మహిళలు అభద్రతతో బిక్కుబిక్కుమని గడిపారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి బాంబులతో తెగబడేవారని గుర్తుచేశారు.
కానీ ఇవాళ పరిస్ధితులు మారిపోయాయని దేశంలో ఎక్కడైనా బాణాసంచా పేలినా పాకిస్తాన్ తన ప్రమేయం లేదని వివరణ ఇస్తోందని చెప్పుకొచ్చారు. ఏ దాడిలోనైనా తన ప్రమేయం ఉన్నట్టు బయటపడితే భారత్ తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చి దాడులు చేపడుతుందని పాకిస్తాన్కు అర్ధమైందని అన్నారు.
Read More :
Manipur | మణిపూర్లో 11 చోట్ల రేపు రీపోలింగ్..