(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): గతంలో గుండెపోటు వచ్చినవారు యోగా చేస్తే, గుండె సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు శారీరకంగా కూడా చురుగ్గా ఉంటారని ఐసీఎంఆర్-మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ శాస్త్రవేత్త డాక్టర్ అజిత్ సింగ్ తెలిపారు. యోగాభ్యాసంతో శ్వాస సమస్యలకు పరిష్కారం లభించడంతోపాటు మానసిక ప్రశాంతత, శారీరక విశ్రాంతి దొరుకుతుందని గుర్తు చేశారు. దీంతో ఒత్తిడి తగ్గి గుండె మెరుగ్గా పనిచేస్తుందని పేర్కొన్నారు.