న్యూఢిల్లీ : మరో రెండు రోజుల్లో జేఈఈ పరీక్షకు హాజరవ్వాల్సిన ఓ 18 ఏండ్ల విద్యార్థి హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జేఈఈ ఎంట్రెన్స్ పరీక్షల కోచింగ్‌కు ముఖ్య కేంద్రంగా ఉన్న రాజస్థాన్ కోటా నగరంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి పోలీస్ అధికారి శంకర్‌లాల్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఉజ్వల్ మిశ్రా కోటాలోని ఓ హాస్టల్లో ఉంటూ జేఈఈ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నాడు. ఏప్రిల్ 2 నాటి జేఈఈ-మెయిన్స్ పరీక్ష కోసం ఉజ్వల్ మిశ్రా లక్నో వెళ్లాల్సి ఉంది. కానీ, ఉజ్వల్ మిశ్రా ఆదివారం సాయంత్రం 6.30గంటలకు కోటా రైల్వే స్టేషన్‌కు చేరుకొని, వేగంగా వస్తున్న ఓ రైలుకు ఎదురుగా వెళ్లి..పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జేఈఈ-మెయిన్స్, అడ్వాన్స్ కోసం ఉజ్వల్ గత రెండేండ్లుగా కోటాలో కోచింగ్ తీసుకుంటున్నట్టు తెలిసింది.