శనివారం 06 జూన్ 2020
National - May 08, 2020 , 16:34:03

ఎస్ ‌బ్యాంక్ కుంభ‌కోణంలో నిందితుల‌కు రిమాండ్ పొడ‌గింపు

ఎస్ ‌బ్యాంక్ కుంభ‌కోణంలో నిందితుల‌కు రిమాండ్ పొడ‌గింపు

ఎస్ బ్యాంకు కుంభ‌కోణంలో నిందితుల‌కు సీబీఐ కోర్టు రిమాండ్ పొడ‌గించింది. నిందితులైన డీహెచ్ఎఫ్ఎల్ ప్ర‌మోట‌ర్ క‌పిల్ వాధ‌వ‌న్‌, ఆర్కేడ‌బ్యూ డెవ‌ల‌ప‌ర్స్ ప్ర‌మోట‌ర్ ధీర‌జ్ వాధ‌వ‌న్‌ల రిమాండ్‌ను మే 10వ తేదీ వ‌ర‌కు పొడ‌గిస్తున్న‌ట్లు కోర్టు వెల్ల‌డించింది. మాజీ ఎస్‌బ్యాంక్ సీఈవో రాణాక‌పూర్‌కు లంచం ఇచ్చార‌న్న ఆరోప‌ణ‌ల‌పై వీరిద్ద‌రిని అరెస్టు చేశారు. మ‌హాబ‌లేశ్వ‌రంలోని క్వారంటైన్‌లో వీరిని 50 రోజుల త‌రువాత అదుపులోకి తీసుకున్నారు. ఇంత‌కు ముంద‌టి రిమాండ్ ముగియ‌డంతో ఈ రోజు సీబీఐ అధికారులు కోర్టులో హాజ‌రుప‌ర్చారు. వీరిద్ద‌రిని మ‌రింత‌గా విచారించాల్సి ఉంద‌ని సీబీఐ అధికారులు కోర్టులో వాద‌న‌లు వినిపించారు. దీంతో సీబీఐ కోర్టు నిందితుల‌కు రిమాండ్ పొడ‌గించింది. 


logo