రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ప్రలోభాలకు తెరలేపారు : కాషాయ పార్టీపై యశ్వంత్ సిన్హా ఫైర్
ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో సోమవారం తమ ఓటు హక్కు వినియోగించుకుంటుండగా విపక్షాల తరపున బరిలో నిలిచిన రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా మోదీ సర్కార్‌పై ఆరోపణలు గుప్పించారు.
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నిక ఎన్నిక పోలింగ్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం తమ ఓటు హక్కు వినియోగించుకుంటుండగా విపక్షాల తరపున బరిలో నిలిచిన రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా మోదీ సర్కార్‌పై ఆరోపణలు గుప్పించారు. తనకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రలోభాలకు తెరలేపారని, ధన ప్రవాహంతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేశారని కాషాయ పాలకులపై విరుచుకుపడ్డారు.
ఈ ఎన్నికల ఫలితం దేశ ప్రజాస్వామ్య వ్యవస్ధను ప్రతిబింబించే క్రమంలో ప్రజా ప్రతినిధులు విచక్షణతో ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నికలకు చాలా కీలకమని, ఎన్నికల ఫలితం దేశ ప్రజాస్వామ్య ప్రస్ధానాన్ని నిర్ధేశిస్తుందని, ఓటర్లు విచక్షణతో ఓటు వేసి తనను గెలిపించాలని సిన్హా విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ వెలుపల యశ్వంత్ సిన్హా విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రలోభాలకు గురిచేశారని, ప్రభుత్వ యంత్రాంగాన్ని పాలక పార్టీ దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
అధికారంలో లేని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కేంద్రం ప్రజాస్వామ్య విరుద్ధంగా కూల్చివేసిందని దుయ్యబట్టారు. తాను కేవలం రాజకీయ యుద్ధంలోనే పోరాడటం లేదని, ప్రభుత్వ ఏజెన్సీలపైనా పోరాడుతున్నానని అన్నారు. ప్రభుత్వ ఏజెన్సీలు శక్తివంతంగా తయారయ్యాయని, అవి పార్టీలను చీల్చుతూ ప్రజలను తమకు అనుకూలంగా ఓటు వేసేలా ఒత్తిడి తెస్తున్నాయని గతంలో ఐఏఎస్ అధికారిగానూ పనిచేసిన సిన్హా కాషాయ పాలకులపై విమర్శలు గుప్పించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలు పరిష్కరించండి
ఇక ఏఐ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

