Yamuna River | మళ్లీ డేంజర్ మార్క్ ను దాటిన యమునా నది ప్రవాహం
Yamuna River | గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ సహా పలు చోట్ల వరదలు సంభవించాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఢిల్లీ లో యమునా నది (Yamuna River) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. డేంజర్ మార్క్ ను దాటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.
Yamuna River | గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ సహా పలు చోట్ల వరదలు సంభవించాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఢిల్లీ లో యమునా నది (Yamuna River) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. డేంజర్ మార్క్ ను దాటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మొన్నటి వరకూ యమున ఉప్పొంగడంతో జరిగిన నష్టం నుంచి కోలుకోకముందే మరోసారి యమునమ్మ ఉగ్రరూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది.
ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో యమునా నది మరోసారి ఉప్పొంగుతోందని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటి మట్టం డేంజర్ మార్క్ ను దాటి 205.48 మీటర్లుగా నమోదైంది. ఈ సాయంత్రానికి ఇది 205.72 మీటర్లకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా, గత వారం యమునమ్మ ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. నది నీటిమట్టం ఆల్ టైం గరిష్ఠానికి చేరి 208.66 మీటర్లకు చేరింది. దీంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. ముఖ్యమంత్రి అధికారిక నివాసం, మంత్రుల ఇళ్లు, రాజ్ భవన్, ఎర్రకోట, దేశ అత్యున్నత న్యాయ స్థానం సహా పలు ప్రాంతాల్లో వరద నీరు మోకాళ్ల లోతుకు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టడంతో యమునమ్మ కాస్త శాంతించింది. తాజాగా మరోసారి ప్రమాదకరస్థాయికి మించి ప్రవహిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Also Read..
Abbas | సూసైడ్ చేసుకుందామని లారీకి ఎదురెళ్లా.. పాత అనుభవాలు గుర్తుతెచ్చుకున్న అబ్బాస్
KCR Kaanuka Scheme | ‘కేసీఆర్ కానుక’ దరఖాస్తులకు రేపు తుది గడువు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

