Abbas | సూసైడ్ చేసుకుందామని లారీకి ఎదురెళ్లా.. పాత అనుభవాలు గుర్తుతెచ్చుకున్న అబ్బాస్
Actor Abbas | తొంభైయవ దశకంలో నటుడు అబ్బాస్ ఒక సంచలనం. ప్రేమ దేశం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్ తొలి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా యూత్ లో అబ్బాస్ క్రేజ్ అప్పట్లో మాములుగా ఉండేది కాదు. ఇక అమ్మాయిలకైతే కలల రాకుమారుడు.
Actor Abbas | తొంభైయవ దశకంలో నటుడు అబ్బాస్ ఒక సంచలనం. ప్రేమ దేశం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్ తొలి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా యూత్ లో అబ్బాస్ క్రేజ్ అప్పట్లో మాములుగా ఉండేది కాదు. అమ్మాయిలకైతే కలల రాకుమారుడు. ఇక అబ్బాస్ కటింగ్ అంటే అప్పట్లో కుర్రకారు పడిచచ్చిపోయే వారు. కటింగ్ తో పాటు హర్పిక్ యాడ్ కూడా అబ్బాస్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కాగా అబ్బాస్ 2015 తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయాడు. ప్రస్తుతం ఆయన న్యూజిలాండ్ లో స్థిరపడ్డాడు. ఆయన రీ ఎంట్రీ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా పలువురు దర్శక నిర్మాతలు కూడా ఆయన్ని మళ్లీ సినిమాల్లోకి తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. మంచి క్యారెక్టర్ పడితే ఆయన కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే అబ్బాస్ ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట. టెన్త్ క్లాస్ ఫెయిలవ్వడం, అదే సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ వదిలి వెళ్లడం తనను ఎంతగానో బాధించిందట. దాంతో ఆ బాధను భరించలేక జీవితానికి ముగింపు పలకాలని భావించినట్లు తెలిపాడు. సూసైడ్ చేసుకోవాలని లారీకి ఎదురెళ్లానని, కానీ అంతలో మనసు మార్చుకొని సూసైడ్ ఆలోచనను విరమించుకున్నట్లు వెల్లడించాడు. ప్రేమదేశం అనే తమిళ డబ్బింగ్ సినిమాతో పరిచయమైన అబ్బాస్.. తెలుగులో ప్రియా.. ఓ ప్రియా, రాజా, కృష్ణబాబు, అల్లుడుగారు వచ్చారు, నీ ప్రేమకై వంటి సినిమాల్లో నటించాడు. తమిళంలో పలు సీరియల్స్లోనూ మెప్పించాడు. ఇక 2015లో పచ్చక్కల్లం అనే మలయాళం సినిమాలో చివరిసారిగా కనిపించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

