జమ్మికుంట, ఆగస్టు 31: ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే యాదవుల అభ్యన్నతి సాధ్యమని.. వారికి అధికార భాగస్వామ్యం కల్పించేందుకే గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంగళవారం పోలవేని పోచమల్లు ఆధ్వర్యంలో జమ్మికుంట మండ లం కోరపల్లి, వీణవంక మండలం వల్భాపూర్‌కు చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన యాదవ యువకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. 2019 పశుగణన ప్రకారం తెలంగాణ రాష్ట్రం 1.92 కోట్ల గొర్రెల సంఖ్యతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పా రు. రాష్ట్రంలో 1.22 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి పెరిగిందన్నారు. ఉద్యమ కెరటం గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించుకొని హుజూరాబాద్‌ను అభివృద్ధిలో రాష్ర్టానికే ఆదర్శంగా నిలుపుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టిందని విమర్శించారు. దళిత, గిరిజన, ఓబీసీలకు ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు లేకుండా కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి పార్టీకి బుద్ధి చెప్పడానికి ఇదే సరైన సందర్భమని చెప్పారు. హుజూరాబాద్ గడ్డ టీఆర్ఎస్కు అడ్డా అని, గులాబీ జెండానే ప్రజలకు అండా అని హరీశ్‌రావు పేర్కొన్నారు.