న్యూఢిల్లీ: మహిళా రెజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బ్రిజ్ భూషణ్‌ను పదవి నుంచి తొలగించాల్సిందేనని రెజ్లర్లు పట్టుడుతున్నారు. ఆయనను జైలుకు పంపే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టంచేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వరుసగా మూడో రోజు కూడా వారు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. వారికి ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారుడు విజేందర్ సింగ్ మద్దతు ప్రకటించారు. శుక్రవారం ఉదయం జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్న విజేందర్.. వారితో కలిసి నిరసనవ్యక్తం చేశారు. రెజ్లర్లను కలిసేందుకే తాను ఇక్కడికి వచ్చానని చెప్పాడు.
Boxer Vijender Singh joins wrestlers' protest against the Wrestling Federation of India, at Jantar Mantar in Delhi
"I've come here to meet the wrestlers today," he says. pic.twitter.com/qUXBK0Oc0o
— ANI (@ANI) January 20, 2023
కాగా, లైంగిక వేధింపులకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, బ్రిజ్ భూషణ్‌ను జైలుకు పంపే వరకు తాము నిరసన కొనసాగిస్తామని రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షిమాలిక్, బజరంగ్ పునియా వెల్లడించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి హామీ రాలేదని, సర్కారు చర్యలు తీసుకోకపోతే పోలీసులను ఆశ్రయిస్తామని స్పష్టంచేశారు.
కాగా, రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. 72 గంటల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డబ్ల్యూఎఫ్ఐను హెచ్చరించింది. మరోవైపు, కేంద్ర తరఫున రాయబారిగా స్టార్ రెజ్లర్, బీజేపీ నాయకురాలు బబితా ఫొగాట్ రెజ్లర్లతో చర్చలు జరిపారు. ప్రభుత్వం రెజ్లర్లకు అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం క్రీడా శాఖ అధికారులు కూడా రెజ్లర్లతో చర్చలు జరిపారు. వారి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, నిరసన విరమించాలని కోరారు. అయితే ప్రభుత్వం హామీలతో సరిపెట్టకుండా, తక్షణమే చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. మరోవైపు, రెజర్ల ఆరోపణలపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ ఢిల్లీ పోలీసులకు, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేశారు. కాగా, రెజ్లర్లకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష బాసటగా నిలిచారు. మహిళా అథ్లెట్ల భద్రతకు సాధ్యమైనదంతా చేస్తామని చెప్పారు.