Indians arrest | కాలిఫోర్నియాలో అక్రమ వలసదారులు అరెస్ట్.. వారిలో 30 మంది ఇండియన్స్
Indians arrest | అమెరికా (USA) లోని కాలిఫోర్నియా (California) లో ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల వద్ద బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు 49 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారు. అమెరికాలోని కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ఈ విషయాన్ని వెల్లడించింది. వారిలో 30 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది.
Indians arrest : అమెరికా (USA) లోని కాలిఫోర్నియా (California) లో ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల వద్ద బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు 49 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారు. అమెరికాలోని కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ఈ విషయాన్ని వెల్లడించింది. వారిలో 30 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది. కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులు నడుపుతున్నట్లు, మరికొందరు అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అమెరికాలో ఇటీవల జరిగిన ట్రక్కు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ట్రంప్ సర్కారు విదేశీ ట్రక్కు డ్రైవర్లకు వర్క్ వీసాలు, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని ఇప్పటికే నిలిపివేసింది. ప్రస్తుతం వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులను నడుపుతున్న వారిపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 మధ్య బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్లు నిర్వహించిన ఆపరేషన్‌లో వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీట్రక్కులు నడుపుతున్న 42 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు.
వారిలో 30 మంది భారత్‌కు చెందినవారు కాగా.. మిగిలినవారు చైనా, మెక్సికో, రష్యా, తుర్కియే మొదలైన దేశాలకు చెందినవారని అధికారులు వెల్లడించారు. అనంతరం కాలిఫోర్నియాలోని వాణిజ్య ట్రక్కింగ్ కంపెనీలను లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ఆపరేషన్ ‘హైవే సెంటినెల్’ లో మరో ఏడుగురు అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు తెలిపారు. దాంతో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 49కు చేరింది. వలస చట్టాల ఉల్లంఘనలను నివారించడం, దేశంలోని హైవేలను రక్షించడం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

