బద్రీనాథ్: చార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ దేవాలయాన్ని భక్తుల కోసం ఆదివారం ఉదయం 6 గంటలకు తెరిచారు. వేద మంత్రోచ్చారణల నడుమ దేవాలయం తలుపులను తెరిచారు. భక్తులపైన 10 నిమిషాలపాటు హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు.
భక్తులు ‘జై బదరీ విశాల్’ అంటూ నినాదాలు చేశారు. భారత సైన్యం బ్యాండ్ భక్తి సంగీతాన్ని వినిపించింది. మన, బేమ్నీ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు ఝుమైలో నృత్యం చేశారు. ఇతర రాష్ర్టాల భక్తులు భజనలు చేశారు. 15 టన్నుల రకరకాల పూలతో దేవాలయాలను అలంకరించారు.