న్యూఢిల్లీ, మే 8: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో ప్రపంచ బ్యాం కు గ్రూపు అధ్యక్షుడు అజయ్ బంగ గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీరు(పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు జరిపిన మరుసటిరోజే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుం ది. తొమ్మిదేండ్లపాటు సుదీర్ఘంగా సాగిన చర్చలకు ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది.