న్యూఢిల్లీ: భారత దేశ రైతులను దెబ్బతీసే ఏ చర్యలకైనా అడ్డుగోడగా నిలుస్తానని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. అమెరికా సుంకాల నేపథ్యంలో వ్యవసాయ ఎగుమతులు, దిగుమతులపై డొనాల్డ్ ట్రంప్‌కు మోదీ పరోక్షంగా సందేశం పంపారు. ఎగుమతుల ద్వారా రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తున్నారని చెప్పారు. పశుపాలన, పాల ఉత్పత్తులో భారత్ అగ్రగామిగా ఉందని తెలిపారు. 125 కోట్ల డోసులు పశు వ్యాక్సిన్లు ఉచితంగా వేశామన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన మోదీ.. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘పండ్ల ఉత్పత్తుల్లో భారత్ ప్రపంచ నంబర్ వన్‌గా ఎదిగింది. వరి, గోధుమ, కూరగాయల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నాం. రైతులు రూ.4 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నారు. ఫసల్ బీమా యోజన రైతులకు అండగా నిలుస్తున్నది.
ఇంగ్లిష్ మెంటాలిటీ నుంచి బయటపడి ఐపీసీ స్థానంలో బీఎన్ఎస్ తెచ్చాం. చిన్న నేరాలకే జైలులో పెట్టే పాత చట్టాల్లో మార్పులు తేవాలి. అన్ని రంగాల్లోనూ సంస్కరణలు తెస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదు. జీఎస్టీపై రాష్ట్రాలతో చర్చించి మార్పులు చేర్పులు చేస్తున్నాం. జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలు దీపావళి లోపు వస్తాయి. సామాన్యులపై భారాన్ని తగ్గించేలా దీపావళి కానుక ఇస్తాం.
యువత కోసం రూ.లక్ష కోట్లతో ప్రధాని వికసిత్ భారత్ యోజన ప్రవేశపెడుతున్నాం. కొత్త కంపెనీల్లో ఉద్యోగులకు నెలకు రూ.15 వేలు కేంద్రం ఇస్తున్నది. పది కోట్ల ఎస్‌ఎస్‌జీలు స్వయం స్వయంసమృద్ధి వైపు నడుస్తున్నాయి. డ్రోన్ దీదీ పథకం గ్రామీణ మహిళలకు సాధికారత ఇస్తున్నది. 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా చేయడమే లక్ష్యం. భారత్ ఎలాంటి యుద్ధానికైనా సర్వసన్నద్ధంగా ఉంది. ఆపరేషన్ సింధూర్‌తో పాక్ దాడిని సమర్థంగా తిప్పికొట్టాం. దేశ రక్షణ విషయంలో ఎవరితోనూ రాజీపడే ప్రసక్తే లేదు. యుద్ధ రంగంలో అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నాం. త్వరలో సుదర్శన చక్ర మిషన్ ప్రారంభిస్తాం. శ్రీకృష్ణుడి సుదర్శనచక్రం స్ఫూర్తితో సుదర్శనచక్ర మిషన్ తీసుకొస్తున్నాం. దవాఖానలు, రైల్వేస్టేషన్లు, బహిరంగ ప్రదేశాల్లో దీనిని అమలు చేస్తాం.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, “Bharat ke kisan, machuware, pashupalak se judi kisi bhi ahitkaari neeti ke aage Modi deewar banke khada hai…”
“Modi is standing like a wall in front of any policy against the interest of our farmers, fishermen, cattle… pic.twitter.com/vHdRWR1hkP
— ANI (@ANI) August 15, 2025