ఇండోర్: కరోనా మహమ్మారి మరోసారి జూలు విదుల్చుతున్నది. కొత్త రూపంలో వచ్చిన వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ వదలట్లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు టీకా టీసుకున్నప్పటికీ ఓ మహిళ కరోనా బారిన పడింది.
ఓ 30 ఏండ్ల మహిళ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి దుబాయ్ వెళ్లడానికి ఇండోర్ విమానాశ్రయానికి వచ్చింది. నిబంధనల ప్రకారం అధికారులు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. కాగా, ఆమె గత జనవరి నుంచి ఆగస్టు మధ్య వివిధ దేశాల్లో కరోనా వ్యాక్సిన్ నాలుగు డోసులు తీసుకున్నదని అధికారులు తెలిపారు.
ఆమె పన్నెండు రోజుల క్రితం ఇండోర్‌కు వచ్చిందని వెల్లడించారు. మళ్లీ దుబాయ్‌కి వెళ్లాల్సి ఉండగా.. ప్రయాణానికి ముందు రోజు కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. అయితే తాము నిర్వహించిన ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని చెప్పారు.