న్యూఢిల్లీ: ఒక మహిళ పెంపుడు కుక్క పిల్లలను కొన్ని రోజులుగా కారులో నిర్బంధించింది. స్థానికులు దీనిని గమనించి జంతు ప్రేమికులు, మహిళా కార్యకర్తలకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆ కారు అద్దం పగులగొట్టి ఆ కుక్క పిల్లలను రక్షించారు. (Women Activists Rescue Puppies) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. చిరాంగ్ ఎన్క్లేవ్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ కొన్ని రోజులుగా ఇంటి ముందు పార్క్ చేసిన కారులో మూడు పెంపుడు కుక్క పిల్లలను ఉంచి లాక్ చేసింది. స్థానికులు ఈ విషయాన్ని గమనించారు. కుక్క పిల్లల పట్ల ఆ మహిళ అమానుషంగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కొందరు మహిళలు, సామాజిక కార్యకర్తలు ఆమె ఇంటికి వెళ్లారు. కారులో బంధించిన కుక్క పిల్లలను బయటకు తీయాలని ఆ మహిళకు చెప్పారు.
కాగా, ఆ మహిళ మూడు కుక్క పిల్లలను కారు నుంచి బయటకు తీసేందుకు నిరాకరించింది. అలాగే అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ మహిళల కాళ్లు పట్టుకుని ప్రాథేయపడింది. దీంతో జంతు ప్రేమికులు, మహిళా కార్యకర్తలు ఆ కారు వెనుక అద్దం పగులగొట్టారు. కారులో ఉన్న మూడు కుక్క పిల్లలను బయటకు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కుక్క పిల్లల యాజమానురాలైన మహిళ తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు.
देखिए महिलाओं ने कार के शीशे तोड़कर #RepublicDay2024 पर आज़ाद कराए कार में बंद डॉग के बच्चें
दिल्ली चिरांग इंकलेव में एक घर के बाहर कार मे बंद थे डॉग के बच्चें महिला सोशल वॉलंटियर और कॉलोनी की महिलाओं ने दिखाई हिम्मत कार के शीशे तोड़कर डॉग को बचाया बताया जा रहा है डॉग को कार मे… pic.twitter.com/Zny7PHPHcm
— Lavely Bakshi (@lavelybakshi) January 26, 2024