చెన్నై: తమిళనాడులోని (Tamil Nadu) కడలూరు జిల్లా పన్రుతి సమీపంలో దారుణం చోటుచేసుకున్నది. ఓ మహిళలను చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టడంపోపాటు వివస్త్రను చేశారు. నలుగురు మహిళలలు కలిసి ఓ మహిళను ఆమె చీరతోనే చెట్టుకు కట్టేశారు. అనంతరం ఆమెపై దాడిచేయడంతోపాటు జాకెట్ను చించివేశారు. నువ్వు కుక్కతో సమానం అంటూ ఓ మహిళ బాధితురాలిని బూతులు తిడుతుండగా, మరొకరు కర్రతో కొట్టింది. మరొకరు ఆమె జట్టుపట్టుకుని లాగింది. అక్కడితో ఆగకుండా ఆమె జాకెట్ను చించివేశారు. అయితే బాధితురాలిని పూర్తిగా వివస్త్రను చేయకుండా ఆ నలుగిరిలో ఒకరు ఆమెను గట్టిగా పట్టుకున్నది. ఇదంతా అక్కడే ఉన్న కెమెరాలో రికార్డయింది. 2.13 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా భూ వివాదం కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఓ మహిళలను అరెస్టు చేశామని, మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారని చెప్పారు. వారిని గాలించడం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. దాడికి కుల వివక్ష కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.