లక్నో: కన్న పిల్లలను చంపేందుకు తల్లి ప్రయత్నించింది. గొంతు నొక్కడంతో ఆరేళ్ల కుమార్తె మరణించింది. మూడేళ్ల కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నది. (Woman Strangles Children) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సునీల్ యాదవ్, సరోజ భార్యాభర్తలు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన సునీల్ లక్నోలో నివసిస్తున్నాడు. తన సోదరుడి పెళ్లి కోసం 20 రోజుల కిందట గ్రామానికి తిరిగి వచ్చాడు.
కాగా, జూన్ 9న సరోజ తన ఇద్దరు పిల్లలను కొట్టింది. భర్త సునీల్ ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో స్థానికులు జోక్యం చేసుకున్నారు. అయితే సోమవారం రాత్రి సరోజ మళ్లీ తన పిల్లలపై దాడి చేసింది. కొట్టడంతోపాటు వారి గొంతు నొక్కింది. ఈ నేపథ్యంలో ఆరేళ్ల కుమార్తె శాన్విని మరణించింది. మూడేళ్ల కుమారుడు కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మూడేళ్ల బాలుడికి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. నిందితురాలైన మహిళను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మామ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: