బెంగళూరు: ఒక యువకుడు పొరుగింటి యువతి ఇంట్లోకి చొరబడ్డాడు. నిద్రిస్తున్న ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె అడ్డుకోవడంతో కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. (Neighbour Stabs Woman) కర్ణాటకలోని హుబ్బల్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వీరాపూర్ ఓని గ్రామానికి చెందిన 21 ఏళ్ల విశ్వ అలియాస్ గిరీష్ సావంత్, పొరుగింటికి చెందిన 20 ఏళ్ల అంజలి అంబిగేరా వెంటపడి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. నిద్రిస్తున్న అంజలిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహంతో కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. హత్యకు గురైన అంజలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు గిరీష్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.