లక్నో: మహిళా ప్రిన్సిపాల్‌ను బలవంతంగా తొలగించారు. (Principal Forcibly Removed) కొత్త ప్రిన్సిపాల్ కోసం కుర్చీ ఖాళీ చేయాలని స్కూల్ సిబ్బంది డిమాండ్ చేశారు. ఆమె నిరాకరించడంతో ఛైర్‌ను ముందుకు లాగి బలవంతంగా ఆఫీస్ నుంచి తొలగించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 11న జరిగిన యూపీపీఎస్సీ రివ్యూ ఆఫీసర్, అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ పరీక్ష పేపర్ లీక్ అయ్యింది. బిషప్ జాన్సన్ బాలికల పాఠశాల పరీక్షా కేంద్రం నిర్వాహకుడు వినీత్ జస్వంత్‌ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్కామ్‌లో ప్రిన్సిపాల్ పరుల్ సోలమన్‌కు ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో షెర్లిన్ మాస్సేను కొత్త ప్రిన్సిపాల్‌గా నియమించారు.
కాగా, ఆ సంస్థ ఛైర్మన్ బిషప్ మారిస్ ఎడ్గార్ డాన్ నేతృత్వంలో స్కూల్ సిబ్బంది ప్రిన్సిపాల్ కార్యాలయంలోకి ప్రవేశించారు. ఛైర్‌ను ఖాళీ చేయాలని ప్రిన్సిపాల్ పరుల్ సోలమన్‌ను డిమాండ్ చేశారు. ఆమె నిరాకరించడంతో మొబైల్ ఫోన్ లాక్కున్నారు. అనంతరం పరుల్ కూర్చొన్న ఛైర్‌ను ముందుకు లాగి బలవంతంగా ఖాళీ చేయించారు. ఆ తర్వాత కొత్త ప్రిన్సిపాల్ ఆ సీటులో కూర్చోగా అక్కడున్న వారంతా ఆమెను అభినందించారు.
మరోవైపు ప్రిన్సిపాల్ సీటును బలవంతంగా ఖాళీ చేయించడంపై పరుల్ సోలమన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పరుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని ఆ స్కూల్ యాజమాన్యం పేర్కొంది. ఆమెను బలవంతంగా కుర్చీ నుంచి ఖాళీ చేయించిన వీడియో క్లిప్‌ను విడుదల చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
The Rice Bags 😂
This is Bishop Johnson Girls School, a missionary school in Prayagraj.
As seen in the video, the lady Principal of this school is being forcefully removed from her chair and the new Principal takes over. 😱😱
— Boiled Anda 🥚🇮🇳 (@AmitLeliSlayer) July 5, 2024