Ayalaan | కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) , రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం అయలాన్ (Ayalaan). ఆర్ రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ తమిళనాడులో పొంగళ్ కానుకగా జనవరి 12న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అయలాన్ తెలుగు వెర్షన్ ను కూడా అదే తేదీన (జనవరి 26న) తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్గా విడుదల చేయాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల థియేటర్ల నుంచి తొలగించారు.
కాగా తమిళ్ వెర్షన్ ఫిబ్రవరి 9 సన్ నెక్ట్స్లోకి వచ్చేసింది. అయితే తెలుగు వెర్షన్ ఎప్పుడు వస్తుందనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తెలుగులో కూడా మేకర్స్ విడుదలకు ప్లాన్ చేసినప్పటికీ వర్కవుట్ కాలేదు. కానీ మేకర్స్ అప్పటినుంచి థియేటర్ రిలీజ్ అప్డేట్ లేదా ఓటీటీ రిలీజ్పై కూడా ఎలాంటి వార్త షేర్ చేయలేదు.
తీవ్ర నిరాశలో ఉన్న తెలుగు మూవీ లవర్స్ కు ఫైనల్గా మేకర్స్ అదిరిపోయే వార్త అందించారు. అయలాన్ డైరెక్టుగా టీవీలో సందడి చేయనుంది. డిసెంబర్ 21న మధ్యాహ్నం 3 గంటలకు ప్రీమియర్ కానుంది. అయితే తెలుగు ఓటీటీ వెర్షన్ రిలీజ్కు సంబంధించి మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్.
అయలాన్ 2 కూడా తెరకెక్కించనున్నట్టు కేజేఆర్ స్టూడియోస్, ఫాంటోమ్ఎఫ్ ఎక్స్ స్టూడియో ఇప్పటికే సంయుక్తంగా ప్రకటన కూడా చేశాయి. సీక్వెల్ కోసం ప్రత్యేకించి రూ.50 కోట్లు కేవలం వీఎఫ్ఎక్స్, సీజీఐ పనుల కోసమే ఖర్చుపెట్టబోతున్నట్టు కూడా ప్రకటించారు మేకర్స్. ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.