Suriya 46 | కోలీవుడ్ యాక్టర్ సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి వెంకీ అట్లూరితో చేస్తున్న సూర్య 46 (Suriya 46). ఈ మూవీలో ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ నటి రవీనా టాండన్ కీలక పాత్ర పోషిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
కాగా సూర్య ఎంత ప్రొఫెషనల్‌గా ఉంటాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తను పని చేసే టీం మెంబర్స్ ప్రతీ ఒక్కరికి సమానమైన గౌరవాన్ని చూపిస్తుంటాడు. వారిలో ఒకడిగా కలిసిపోయి కష్టసుఖాల్లో అండగా నిలుస్తూ ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తుంటాడు. సూర్య నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి సూర్య 46. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.
సెట్స్ లో ఓ ప్రముఖ వ్యక్తి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు సూర్య. ఇంతకీ ఎవరా వ్యక్తి అనే కదా మీ డౌటు. మూవీ క్రూ మెంబర్లో ఒకరి చిన్నారి పుట్టినరోజును సెట్స్‌లో గ్రాండ్‌గా జరిపారు. సూర్య, మమితా బైజుతోపాటు చిన్నా పెద్దా అంతా కలిసి ఆ చిన్నారితో కేక్ కట్ చేయించి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సూర్య 46లో సీనియర్ నటి రాధికాశరత్ కుమార్, తమిళ నటి భవాని స్రే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
#Suriya & #MamithaBaiju from the sets of #Suriya46📸♥️ pic.twitter.com/phgIUlynzD
— AmuthaBharathi (@CinemaWithAB) December 14, 2025