Bhaichung Bhutia : అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi)కి భారతీయులు నీరాజనాలు పలుకుతున్నారు. గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా కోల్‌కతాలో తొలి అడుగు పెట్టిన ఫుట్‌బాల్ దిగ్గజానికి అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే.. తాము ఎంతగానో ఆరాధించే ఆటగాడిని మాత్రం ప్రత్యక్షంగా చూడలేకపోయారు ఫ్యాన్స్. సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేసినా సరే.. వీఐపీల కారణంగానే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని భారత మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా (Bhaichung Bhutia) మండిపడ్డాడు.
గోట్ ఇండియా టూర్ 2025లో మెస్సీ మొదట కోల్‌కతాలో అడుగుపెట్టాడు. సాకర్ మాంత్రికుడి పర్యటన సందర్భంగా లేక్ టౌన్లో 70 అడుగుల నిలువెత్తు మెస్సీ విగ్రహం ఏర్పాటు చేసింది స్థానిక క్లబ్. ఈవెంట్ మేనేజర్ శతద్రు దత్తా (Satadru Dutta) సాల్ట్ లేక్ మైదానంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే.. ‘మైదానంలోకి తన బృందంతో అభిమానులను పలకరించేందుకు వెళ్లిన మెస్సీని ఒక్కసారిగా వీఐపీలు, రాజకీయనాయకులు చట్టుముట్టారు. దాంతో.. ఫ్యాన్స్ అతడిని చూడలేకపోయారు. కెమెరాల్లో తమ స్టార్ ఆటగాడిని ఫొటోలు తీయలేకపోయారు. వీఐపీలంతా తన చుట్టూ గుమికూడడంతో స్వేచ్ఛగా తిరగలేకపోయాడు మెస్సీ. అసౌకర్యంగా అనిపించడంతో వెంటనే ఫుట్‌బాల్ దిగ్గజాన్ని భారీ భద్రత నడుమ స్టేడియం నుంచి తీసుకెళ్లారు.
#WATCH | Raipur, Chhattisgarh: On chaos at Lionel Messi’s Kolkata event, former Indian footballer and Captain, Bhaichung Bhutia says, “I think it’s very unfortunate. I think the organisers did their best, but sometimes it gets out of control, especially VIP culture – it becomes… pic.twitter.com/JoSoSeYxZv
— ANI (@ANI) December 13, 2025
షెడ్యూల్ ప్రకారం గంట సేపు ఉండి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాల్సిన మెస్సీ.. 22 నిమిషాల్లోనే బయటకొచ్చేశాడు. దీనికంతటికీ వీఐపీ సంస్కృతే కారణమని భైచుంగ్ భూటియా అన్నాడు. ఇకనైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల’ని భూటియా సూచించారు.
కోల్‌కతాలో నిర్వాహకుల వైఫల్యంతో మెస్సీ ఈవెంట్ పక్కాగా జరిగేలా చర్యలు తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. కట్టుదిట్టమైన భద్రత ఉండడంతో.. ప్రశాంత వాతావరణంలో మెస్సీ అభిమానులను అలరించాడు. స్పోర్ట్స్ వేర్లో ఉప్పల్ స్టేడియంలో అడుగుపెట్టిన మెస్సీ.. మూడు కిక్ షాట్లతో బంతిని గ్యాలరీల్లోకి పంపి ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. అయితే..సీఎం రేవంత్ రెడ్డి టీమ్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ మాత్రం ఆడలేదీ అర్జెంటీనా కెప్టెన్.
Angry fans threw chairs and bottles onto the pitch after Lionel Messi’s visit to Kolkata’s Salt Lake Stadium.
Thousands paid up to 12,000 rupees (€113) to catch a glimpse of their hero walk around the pitch, but were left enraged when he was hidden among a large pack of… pic.twitter.com/7vcm8JZYKw
— DW Sports (@dw_sports) December 13, 2025