Lionel Messi : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) తన ‘గోట్ టూర్’లో భాగంగా ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం ముంబైలో అడుగుపెట్టాడు. నగరంలో ఓ హోటల్లో రెస్ట్ తీసుకున్న మెస్సీ.. కొద్దిసేపటి క్రితమే వాంఖడే స్టేడియానికి చేరుకున్నాడు. కాసేపట్లో అక్కడ ఎగ్జిబిషన్ మ్యాచ్ మొదలుకానుంది. తన భారత పర్యటనలో భాగంగా ఇప్పటికే కోల్‌కతా, హైదరాబాద్‌లలో పర్యటించిన మెస్సీ ఇవాళ ముంబైకి వెళ్లాడు.
ముంబైలో మెస్సీ పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగే ఓ కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో మెస్సీ భేటీ కానున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. వాంఖడేలో బాలీవుడ్ ప్రముఖులతో కలిసి మెస్సీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు.
మ్యాచ్ అనంతరం జరిగే ఓ ప్రైవేట్ ఫ్యాషన్ షోలో.. 2022 ఫిఫా వరల్డ్ కప్‌కు సంబంధించిన తన వస్తువులను మెస్సీ వేలం వేయనున్నాడు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘గోట్ ఫుట్‌బాల్ క్లినిక్’లో భాగంగా మెస్సీ చిన్నారులకు ఫుట్‌బాల్ మెళుకువలు నేర్పించనున్నాడు. భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం.
శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన మెస్సీ కార్యక్రమంలో నిర్వాహకుల వైఫల్యం కారణంగా గందరగోళం చెలరేగింది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ముంబై పోలీసులు నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముంబై పర్యటన ముగిశాక, మెస్సీ తన టూర్లో చివరి మజిలీ అయిన ఢిల్లీకి వెళ్లనున్నాడు.
VIDEO | Mumbai: Fans in large numbers gather ahead of footballer Lionel Messi’s arrival at Wankhede Stadium.
(Full video available on PTI Videos – https://t.co/dv5TRAShcC) pic.twitter.com/qRrxuQ4YhU
— Press Trust of India (@PTI_News) December 14, 2025