బెంగళూరు: మార్నింగ్ వాక్కు వెళ్తున్న మహిళను ఒక వ్యక్తి లైంగికంగా వేధించాడు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. గట్టిగా కేకలు వేసిన ఆ మహిళ చివరకు అతడి బారి నుంచి తప్పించుకుంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Woman On Morning Walk Groped) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ దారుణం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కోననకుంటె ప్రాంతంలో ఒక మహిళ మార్నింగ్ వాక్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చింది. స్నేహితురాలి కోసం ఒక చోట ఆమె ఎదురుచూస్తున్నది.
కాగా, ఒక వ్యక్తి ఆ మహిళను సమీపించాడు. వెనుక నుంచి ఆమెను పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. పెనుగులాడిన ఆ మహిళ అతడి బారి నుంచి తప్పించుకుని పరుగు తీసింది. వెంటపడిన అతడు మళ్లీ ఆమెను పట్టుకున్నాడు. నోరు మూసి లైంగికంగా వేధించాడు. రక్షించాలని ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. ఆ ప్రాంతంలోని కుక్కలు కూడా మొరగడంతో ఆ వ్యక్తి ఆమెను వదిలి పారిపోయాడు. ఆ మహిళ కూడా అక్కడి నుంచి పరుగులు తీసింది.
మరోవైపు రాజస్థాన్‌కు చెందిన బాధిత మహిళ తన భర్తతో కలిసి ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, సీసీటీవీ ఫుటేజ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Sexual Harassment Caught on CCTV: #Bengaluru Woman Groped Twice by Man During Morning Walk
The Konankunte police have officially registered a case and are working to identify the suspect involved in this troubling incident.#CrimeNews #Crime #CCTV pic.twitter.com/07kKxy4ROS
— TIMES NOW (@TimesNow) August 5, 2024