Encounter | గుండు తాకింది గుండె కరిగింది.. ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన మావోయిస్టుకు పోలీసుల ప్రాణదానం
శుక్రవారం రాత్రి.. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా, హుస్సిపీ అటవీ ప్రాంతం.. పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్కౌంటర్.. తుపాకుల మోతతో అడవి అంతా దద్దరిల్లింది. ఈ ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు తీవ్రంగా గాయపడ్డాడు.
- సహచరుడిని అక్కడే వదిలి వెళ్లిన నక్సల్స్
- అడవిదారిలో 5 కిలోమీటర్లు మోస్తూ దవాఖానకు తీసుకెళ్లిన పోలీసులు
- జార్ఖండ్‌లోని సింగ్భూమ్లో ఘటన
Encounter | రాంచీ: శుక్రవారం రాత్రి.. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా, హుస్సిపీ అటవీ ప్రాంతం.. పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్కౌంటర్.. తుపాకుల మోతతో అడవి అంతా దద్దరిల్లింది. ఈ ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే సహచర మావోయిస్టులు అతన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. భద్రతా సిబ్బందికి గాయాల బాధతో మూలుగుతున్న మావోయిస్టు కనిపించగా వెంటనే అతడిని భుజాలపైకి ఎత్తుకుని, ఐదు కిలోమీటర్లు అడవిలో నడిచి ప్రాణదానం చేశారు.
అతడి పట్ల పోలీసులు చూపిన మానవత, ఔదార్యంపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. గత శుక్రవారం పోలీసులు యాంటీ మావోయిస్టు ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గాయపడిన మావోయిస్టును భద్రతా సిబ్బంది భుజానికెత్తుకుని ఐదు కిలోమీటర్లు నడిచి హాత్తిబురు క్యాంపునకు చేర్చారు. దారిలో మావోయిస్టులు పాతిపెట్టిన ఐఈడీలు ఉంటాయని తెలిసి కూడా ఆ పోలీసులు తమ ప్రాణాలకు తెగించి ప్రాణదాతలుగా మారారు. క్యాంపు వైద్యులు క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం శనివారం హెలికాప్టర్లో రాంచీలోని దవాఖానకు తరలించినట్టు పోలీసు శాఖ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Army helicopter
- BSF
- Encounter
- IEDs
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

