లక్నో: ప్రియుడితో కలిసి హానీమూన్ వెళ్లేందుకు కన్న పిల్లల అడ్డుతొలగించుకోవాలని ఒక మహిళ భావించింది. విషం ఇచ్చి వారిని చంపింది. (Woman Kills Children) పిల్లల మృతిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రోడ్కలి గ్రామానికి చెందిన 24 ఏళ్ల ముస్కాన్ భర్త వసీం చండీగఢ్‌లో పనిచేస్తున్నాడు. ఆమె పిల్లలైన ఐదేళ్ల కుమారుడు అర్హాన్, ఏడాది వయస్సున్న కుమార్తె ఎనయ గురువారం వారి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముస్కాన్ ఇంటికి చేరుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం పిల్లల మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషప్రయోగం వల్ల వారు చనిపోయినట్లు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో తెలిసింది. దీంతో పిల్లల తల్లి ముస్కాన్‌పై పోలీసులు అనుమానించారు. ప్రియుడు జునైద్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు.
మరోవైపు ముస్కాన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. జునైద్‌తో కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్నట్లు ఆమె చెప్పింది. లవర్‌తో హనీమూన్‌కు వెళ్లేందుకు అడ్డుగా ఉన్న పిల్లలకు విషం ఇచ్చి చంపినట్లు ముస్కాన్ ఒప్పుకున్నదని పోలీస్ అధికారి తెలిపారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఆమె ప్రియుడు జునైద్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
Also Read:
PM Modi | అమెరికా సందర్శించాలన్న ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించిన మోదీ.. ఎందుకంటే?
IPS Officer’s Husband Arrested | రూ.7.4 కోట్ల మోసం కేసులో.. ఐపీఎస్ అధికారిణి భర్త అరెస్ట్