Moving Train | మహారాష్ట్ర (Maharashtra)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఉండే లోకల్ ట్రైన్ (Moving Train) నుంచి పడి ఓ మహిళ తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటన బద్లాపూర్ రైల్వే స్టేషన్లో (Badlapur railway station) శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కల్పన జెడియా అనే మహిళ బద్లాపూర్ రైల్వే స్టేషన్లో ఇవాళ ఉదయం కర్జాత్-ముంబై లోకల్ ట్రైన్ (local train) ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే ఉదయం పీక్స్ టైమ్ కావడంతో రద్దీ అధికంగా ఉంది. కాలు పెట్టేకి కూడా స్థలం లేదు. ఎలాగోలా ట్రైన్ ఎక్కిన కల్పన.. జనం ఒత్తిడికి పట్టుకోల్పోయింది. రైలు స్టేషన్ నుంచి బయల్దేరుతుండగా.. ఒక్కసారిగా పట్టాలపై పడిపోయింది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
కాగా, బద్లాపూర్ నుంచి ప్రయాణించే ప్రయాణికులు నిత్యం ఇదే సమస్యలు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కర్జాత్ నుంచి బయల్దేరిన రైలు బద్లాపూర్కు చేరుకునే సరికే కిక్కిరిపోతుందని.. ఈ రైలు తర్వాత అరగంట వరకూ మరో రైలు లేకపోవడంతో అతి కష్టంమీద తలుపులకు అతుక్కునే వెళ్లాల్సి వస్తోందన్నారు. ఆఫీసులకు, కళాశాలలకు వెళ్లే సమయం కావడంతో ఆ రైల్లో రద్దీ అధికంగా ఉంటోందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. దీనివల్ల ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రతను మెరుగుపరిచేందుకు, రద్దీ నియంత్రణకు రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read..
Film ticket | సినీ ప్రియులకు గుడ్న్యూస్.. సినిమా టికెట్లు రూ.200కే పరిమితం చేసిన కర్ణాటక ప్రభుత్వం
Uttarakhand | 24 గంటల్లో మంచు చరియలు విరిగిపడే ప్రమాదం.. ఉత్తరాఖండ్ సహా పలు ప్రాంతాలకు అలర్ట్
Child marriage | 14 ఏళ్ల బాలికకు బలవంతపు పెళ్లి.. భర్తతో వెళ్లేందుకు నిరాకరించడంతో